Header Banner

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

  Sun May 25, 2025 13:55        Politics

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ఓ శుభవార్త అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు మేలు చేకూర్చే కొన్ని కీలక ప్రకటనలు చేయవచ్చని సమాచారం. ఈ ప్రకటనల్లో భాగంగా ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ కరువు భత్యం (డీఏ)లలో ఒకదానిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా, ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇతర బకాయిలు, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన ప్రయోజనాలను కూడా ప్రభుత్వం అదే రోజు చెల్లించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు, ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేకంగా ఒక నూతన ఆరోగ్య పథకాన్ని కూడా ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

 

ఇది కూడా చదవండి: భారీ వర్షాలకు కుప్పకూలిన పోలీస్ స్టేషన్.. ఎస్సై మృతి! వివరాల్లోకి వెళితే..

 

ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ కమిటీ పలుమార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి నుంచి వినతులు స్వీకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించింది. ఉద్యోగులు ప్రస్తావించిన కొన్ని ప్రధాన డిమాండ్లకు కమిటీ సానుకూలంగా స్పందించి, వాటిని ఆమోదించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఈ కమిటీ ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై, తమ సిఫార్సులతో కూడిన నివేదికను అందజేయనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి ఈ నివేదికను ఆమోదించిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు ఈ అంశాలపై అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారని ఉద్యోగ సంఘాల వర్గాలు చెబుతున్నాయి. జూన్ 2న వెలువడనున్న ఈ ప్రకటనల కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

 

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices